
Allagaddanaga ashok
వ్యాధులు ప్రబలకుండా గ్రామంలో శానిటేషన్
శిరివెళ్ళ (పల్లెవెలుగు) 25 ఆగష్టు: కామినేని పల్లె మండల పరిధిలోని కామినేని పల్లి గ్రామంలో దోమలు వ్యాప్తి చెందకుండా గ్రామంలో వీధుల గుండా శానిటేషన్ చేసినట్లు గ్రామ సర్పంచ్ మెరువ చిన్న నాగిరెడ్డి తెలిపారు . అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని గ్రామంలో మురుగు నీరు నిలిచిన చోట ,దోమలు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ పౌడర్, సున్నం వంటి వాటిని చెల్లించామన్నారు. అంతేకాకుండా తాగునీటి ట్యాంకులో క్లోరినేషన్ చేపించామన్నారు. అలాగే రోడ్ల వెంట పెంట దిబ్బలను తొలగించి రోడ్లను శుభ్రం చేయించామన్నారు. అలాగే దోమలు వ్యాప్తి చెందడం వల్ల మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవడ తీసుకోవడం మైనది అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.