
వైయస్సార్ బీమా అభాగ్యులకు ధీమా
శిరివెళ్ల (పల్లెవెలుగు) 24 ఆగష్టు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైయస్సార్ ఉచిత బీమా పథకం ఆపదలో అభాగ్యులకు ధీమా కల్పిస్తున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శిరివెళ్ల మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ బసాపురంబింతియాజ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కటిక సెంటర్లో నివసిస్తున్న షేక్ హుస్సేన్ మృతి చెందిన కారణంగా బాధితుని భార్య నషిమున్ కు ఎంపీడీవో సాల్మన్ రాజు చేతుల మీదుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ కుటుంబ యజమాని కోల్పోయి ఆపదలో ఉన్న బాధితుల కు వైయస్సార్ బీమా ఆదుకుంటున్నదని సూచించారు. ప్రతి ఒక్కరూ వైఎస్సార్ ఉచిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంపై భరోసాగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్కాకుల సాలమ్మ లక్కాకుల చంద్ర సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు