
అభివృద్ధి చేసి చూపించిన గ్రామ సర్పంచ్ దూదేకుల హుస్సేన్ బీ గుర్రప్ప
శిరివెళ్ళ :(కోటపాడు) గ్రామ అభివృద్ధి ని చేసి చూపించడం జరిగిందని గ్రామ సర్పంచ్ దూదేకుల హుస్సేన్ బి గుర్రప్ప, వైయస్సార్ పార్టీ గ్రామ నాయకులు శుభ సత్యనారాయణ లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సిరివెళ్ల మండలం కోటపాడు గ్రామంలో బీసీ కాలనీ నందు సుమారు ఆరు లక్షల రూపాయలతో 486 మీటర్లతో అడుగు లోతు అడుగు వెడల్పు తో డ్రైనేజీ కాలవలు నిర్మించడం జరిగిందనారు. మాట ఇచ్చిన వెంటనే నెరవేరుస్తానని అనే సిద్ధాంతంతో నేను పనిచేస్తున్నానని తెలియజేశారు . కొంతమంది ఇంకా కొన్ని సమస్యలను నా దృష్టికి తీసుకొని రావడం జరిగిందని వాటిని కూడా త్వరలో నెరవేరుస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్ని నెరవేరుస్తానారు. గ్రామ అభివృద్ధికి చేతనైనంత వరకు కృషి చేస్తానని తెలిపారు. వీలైతే గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దుతానని అన్నారు. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి గార్ల సహాయ సహకారాలతో మండలం లోనే కాకుండా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నే. కోటపాడు గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దేందుకు నా సాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు వంక దార సుబ్బ సత్యనారాయణ ,కార్యకర్తలు ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..