Allagaddanaga ashok

ఘనంగా ముగిసిన మొహరం

అంగరంగ వైభవంగా పీర్ల ఊరేగింపు –  భారీ ఎత్తున పాల్గొన్న భక్తులు.

సిరివెళ్ల :(ఎర్రగుంట్ల)మండలం లో మొహరం పర్వదిన వేడుకలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని ఎర్రగుంట్ల, గోవిందపల్లె  ,  ఇంకా తదితర గ్రామాలతోపాటు ఆయా గ్రామాలలో గత ఐదు రోజులుగా చావిడీలలో కొలువుదీరిన పీర్ల ( స్వాముల ) ను అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి చిన్నసరిగెత్తు , మద్యసరిగెత్తు పెద్దసరిగెత్తు కార్యక్రమాలను నిర్వహించి గ్రామాలలోని పురవీధుల గుండా పీర్లను ఊరేగింపు కార్యక్రమాలను భక్తులు ఘనంగా నిర్వహించారు.

మండల పరిధిల ఎర్రగుంట్ల లోని బిక్కీ సావుపిర్లు, చావిడి దగ్గరపీర్లు, దస్తగిరి చావిడి పీర్ల పాటు చావిడిలలో కొలువుదీరిన పలు పీర్లను అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి  గ్రామం లో ఘనంగా ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.  ఎర్రగుంట్ల గ్రామం లోని చావిడిలలో కొలువుదీరిన పిర్లతో గ్రామానికి చెందిన పీర్లను భక్తులు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి వీడ్కోలు పలుకుతూ ఏటికి సాగనంపారు.  ఈ సందర్భంగా యువకులు వివిధ వేషధారణలతో భక్తులను అలరించారు. మొహరం పర్వదినం సందర్భంగా మండలంలోని గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Back to top button
Enable Notifications    OK No thanks