
గుడి నిర్మాణం కోసం రూ 25,116 ఆర్థిక సహాయం
రుద్రవరం (పల్లెవెలుగు) 14 ఆగష్టు: మండలంలోని కొండ మాయ పల్లి, వెలగల పల్లి పొలిమేరలో వెలిసిన శ్రీవాసా పురం వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం కోసం రూ 25,116 ఆర్థిక సహాయాన్ని దాతలు అందజేశారు. శనివారం నాడు ఆలయ ధర్మకర్ సింగ తల మధుసూదన్ రెడ్డి కి రుద్రవరం గ్రామానికి చెందిన పోలా చిన్న నారాయణ ఆయన భార్య లక్ష్మీ నరసమ్మలు ఆలయ నిర్మాణంలో తమ వంతు విరాళంగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.
పోటెత్తిన భక్తులు
శ్రీవాసపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం నాడు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వెంకటేశ్వర స్వామికి కుంకుమార్చన, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. పూజారి గోపి శర్మ ఆధ్వర్యంలో స్వామికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు రుద్రవరం గ్రామానికి చెందిన వెంకట శేషాద్రి శర్మ ఆయన భార్య మధుమతి ఆర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన గంధం రామస్వామి రెడ్డి ఆయన భార్య అమరావతి భక్తులకు అల్పాహారము కోసము విరాళం అందజేశారు. పూజా కార్యక్రమంలో వందలాది భక్తులు పాల్గొన్నారు.