NandyalMani News

బాలాకాడమీ విద్యార్థులకు ప్రశంసించిన ఎంపి, ఎమ్మెల్యే

బాలాకాడమీ విద్యార్థులకు ప్రశంసించిన ఎంపి, ఎమ్మెల్యే

నంద్యాల (మని న్యూస్) 01 జూలై:  పట్టణంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాలాకాడమీ రవీంద్ర హై స్కూల్ విద్యార్థిని S.ఫహిమిదా 591/600 ను నంద్యాల ఎంపి పోచం బ్రహ్మానంద రెడ్డి,  ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రశంసా పత్రం ఇచ్చి ప్రశంసలు తెలపడం జరిగింది. అదేవిధంగా రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల ప్రెసిడెంట్ డాక్టర్ అనిల్ కుమార్, సెక్రటరీ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ విజయ భాస్కర్, మరియు స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి కృష్ణ , డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ గెలివి సహదేవుడు మొదలగువారు, రోటరీ క్లబ్ సెక్రటరీ మోహన్ రెడ్డి , P.D.G కల్లూరి రామలింగారెడ్డి , ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ డాక్టర్ హర్ష సెక్రటరీ శివ జ్యోతి మొదలగువారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ బాలాకాడమీ రవీంద్ర హై స్కూల్ ప్రిన్సిపల్ మాధవి లతని కరస్పాండెంట్ రవికుమార్ ని అత్యుత్తమ విద్యను అందిస్తూ విద్యార్థి భవితవ్యానికి మార్గదర్శకమని ప్రశంసించడం జరిగింది.

Back to top button