NandyalAbdul Javid

“ప్రవక్త ముహమ్మద్ (సల్లెలహు అలైహి వ అస్సాల్లం) ను తెలుసుకుందాం”

“ప్రవక్త ముహమ్మద్ (సల్లెలహు అలైహి వ అస్సాల్లం) ను తెలుసుకుందాం”

 ఉద్యమంలో భాగంగా నంద్యాలలో పుర ప్రముఖులను కలిసి ముహమ్మద్ జీవిత చరిత పుస్తకాలు బహుకరించిన జమాఆతె ఇస్లామీ అధ్యక్షులు అబ్దుల్ సమద్


నంద్యాల (ఆంధ్రప్రతిభ) 29 జూన్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దైవ ప్రవక్త (సల్లెలహు అలైహి వ అస్సాల్లం) వారిపై వస్తున్న అపోహలను దూరం చేయవలసిన ఆవశ్యకత దృష్ట్యా జమాఅత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర వ్యాప్తంగా రండి ప్రవక్త ముహమ్మద్ (సల్లెలహు అలైహి వ అస్సాల్లం) తెలుసుకుందాం పరిచయ ఉద్యమాన్ని జూన్ 24వ తేది నుండి జూలై 3 వరకు చేపట్టింది. ఈ సంధర్భంగా నంద్యాలలో కరపత్రాలు, ప్రవక్త జీవిత పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో నేడు ప్రముఖులు మాజీ మంత్రి, ఎంఎల్సీ ఎన్ఏండి.ఫరూఖ్,  మాజి శాసన సభ్యులు భూమా బ్రహ్మానంద రెడ్డీ,  రామకృష్ణ కళాశాలల ఛైర్మన్ డా.జీ.రాభకృష్ణా రెడ్డీ, ప్రముఖ న్యాయవాది, జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రావినూతల దుర్గా ప్రసాద్, న్యాయవాది డా.జీ.బాల స్వామి,  పోలీసులకు తదితరులకు ప్రవక్త (సల్లెల్లహు అలైహి వ అస్సాల్లం) జీవిత చరిత్ర పుస్తకాలు బహుకరించారు. జమాఅతె ఇస్లామీ హింద్ స్థానిక అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రవక్త (సల్లెలహు అలైహి వ అస్సాల్లం) వారి పై వస్తున్న విమర్శలు అక్షేపనీయమని ఆయన అన్నారు. ఈ అపోహలు అపార్థాలు సరైన సమాచారం లేని కారణంగా ఏర్పడినవే కాబట్టి వాస్తవ సమాచారం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఉద్యమం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ పరిచయ ఉద్యమం ద్వారా ప్రవక్త ముహమ్నద్ (సల్లెలహు అలైహి వ అస్సాల్లం) పై ప్రజలకు ఉన్న అపోహలను దూరం చేయడంతో పాటు ప్రవక్త ముహమ్మద్ (సల్లెలహు అలైహి వ అస్సాల్లం)  వారి బోధనలు తెలియచేయడానికి జమాఅతె ఇస్లామీ హింద్ ప్రయత్నం చేస్తుందని ఆయన అన్నారు. నేటి కార్యక్రమంలో జమాత్ నాయకులు వి.సలీం, నవాజ్ ఖాన్, ముహమ్మద్ ఫయాజ్, అబ్దుల్ కరీం, సయ్యద్ బషీర్ అహమ్మద్ పాల్గొన్నారు.

Back to top button