NandyalAbdul Javid

అగ్ని పత్ ను కేంద్రం వెంటనే రద్దు చేయాలని సత్యాగ్రహ దీక్ష

అగ్ని పత్ ను కేంద్రం వెంటనే రద్దు చేయాలని సత్యాగ్రహ దీక్ష

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 27 జూన్: నంద్యాల జిల్లా బొమ్మల సత్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అగ్ని పత్ ను కేంద్రం వెంటనే రద్దు చేయాలని సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా అంబేద్కర్ విగ్రహం వద్ద సుమారు నాలుగు గంటల సేపు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ ను వెంటనే ఉప సంహరించుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అధికార ప్రతినిధి ఉక్కోటు వాసు, నియోజకవర్గం కోఆర్డినేటర్ ఫరూక్, ట్రెజరీ ప్రసాద్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ వ్యవసాయ నల్ల చట్టాలను ప్రవేశపెట్టి ప్రతిపక్షాల దెబ్బకు దిగి వచ్చి ఏ విదంగానైతే వ్యవసాయ చట్టాలను రద్దు చేశారో? అదేవిధంగా యువకుల జీవితాలతో చెలగాటం ఆడే అగ్నిపత్ ను వెంటనే రద్దు చేయాలని, లేదంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ సెల్ రామకృష్ణ, ట్రీజరీ, ప్రసాద్, సెక్రటరీ రెహమాన్, ఆనంద రావు, సీనియర్ అహమ్మద్ హుస్సేన్, షైక్ష తదితరులు పాల్గొన్నారు.

Back to top button