NandyalAbdul Javid

వాల్మీకి, బోయ విద్యార్థులకు నగదు పురస్కారాల ప్రదానోత్సవం

వాల్మీకి, బోయ విద్యార్థులకు నగదు పురస్కారాల ప్రదానోత్సవం

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 26 జూన్: సంఘమిత్ర సమావేశ మందిరంలో వాయిస్ వారి ఇ ఆధ్వర్యంలో వాల్మీకి విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ అ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో వాయిస్ సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ మురళీకృష్ణ అధ్యక్షత వహించారు ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా శ్రీనివాస రావు ఏ సి టి ఓ వాయిస్ సంస్థ ప్రధాన సలహాదారులు మరియు దాతలు అయినా వీపనగండ్ల బంగారయ్య మరియు శ్రీనివాసులు, విజయ రామచంద్రం, బాల వెంకన్న మరియు  వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయ పులికొండ న్న, డాక్టర్ ఉదయశంకర్, వి ఆర్ పి ఎస్ నంద్యాల పార్లమెంట్ గౌరవాధ్యక్షులు చాబోలు గురప్ప, విశిష్ట అతిధులుగా, వక్తలుగా పాల్గొన్నారు. నంద్యాల పరిసర ప్రాంతాలలోని ప్రభుత్వ విద్యాసంస్థలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో మంచిమార్కులు సాధించిన బీద వాల్మీకి విద్యార్థులు 42 మందికి ఒక్కొక్కరికి 1500 రూపాయల నగదు మరియు 500 రూపాయల విలువగల స్టడీ మెటీరియల్ దాతల సహకారంతో అందివ్వటం జరిగిందని వాయిస్ సంస్థ అధ్యక్షులు మురళి కృష్ణ గారు తెలియ జేశారు. రామాయణ సృష్టికర్త అయిన వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో నైతిక విలువలను, ధర్మాన్ని ఆదర్శంగా చేసుకొని ఆచరించాలన్నారు, పులికొండన్న, మాట్లాడుతూ వాల్మీకులు విద్య ద్వారా అభివృద్ధి సాధించాలని కళాశాలలలో ఏ సమస్య వచ్చినా తమదృష్టికి తేవాలని విద్యార్థులకు చూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న దాతలు శంకర్ మోహన బాబుగారు, గౌరీ శంకర్, నాగరాజు, మహేష్ నాయుడు, రామరాజేశ్వ రి, సాయి స్వరూప్, ప్రొఫెసర్ సాయిబాబు, వాయిస్ సభ్యుడు నాగరాజు , విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

Back to top button