NandyalAbdul Javid

దులహన్ పథకం కూడా ఇవ్వలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి

దులహన్ పథకం కూడా ఇవ్వలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి

  • ధ్వజమెత్తిన తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్.

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 25 జూన్:  పట్టణంలో గాంధీ చౌక్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో దులహన్ పథకం తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని వారు తెలిపారు.

ముస్లిం మైనార్టీలకు ఎన్నికల హామీలో మొండిచెయ్యి చూపించిన జగన్ రెడ్డి

ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రతి రాజకీయ నాయకుడు భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా చూడాలని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే పంచభూతాలను కూడా మోసం చేశాడు అన్నారు.  గద్దెనెక్కిన తర్వాత జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పాడని అన్నారు. ముస్లిం మైనార్టీల సభలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి మాట్లాడుతూ పేద ముస్లిం మహిళలకు దులహన్ పథకం ద్వారా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడని, ఈ రోజు దులహన్ పథకాన్ని ఎత్తివేస్తే న్యాయస్థానం ద్వారా తెలియడం చాలా బాధాకరం అన్నారు. ముస్లిం మైనార్టీల అండ తో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఈరోజు ముస్లిం మైనార్టీల ను దగా చేశారన్నారు. జగన్ రెడ్డి కి ముస్లిం మైనారిటీ సమాజం అండగా ఉండి గెలిపించినందుకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు  ముస్లింలకు రంజాన్ తోఫా, ఇమామ్ మౌజన్ లకు గౌరవ వేతనాలు,దుల్హన్ పథకం, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య, స్కాలర్షిప్ లు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్లు, కుట్టుమిషన్లు, హజ్ హౌస్, షాదీఖానా లు ఇలాంటి అనేక రకాలుగా మైనార్టీలను ఆదుకోవడం జరిగిందని, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలను నమ్మించి మోసం చేశాడు అన్నారు. జగన్ రెడ్డి మూడు సంవత్సరాల పరిపాలన లో అన్ని కోతలు,మోసాలు తోనే కాలం గడిపాడు అన్నారు. జగన్ రెడ్డి కి మాత్రం విదేశాలకు వెళ్లడానికి,సభలు పెట్టుకోవడానికి, మూడు రంగులు వేసుకోవడానికి, నిధులు ఉన్నాయి కానీ కేవలం ముస్లింల ఆదుకోవడానికి నిధులు లేవా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో మైనారిటీలపై దాడులు ఎక్కువైపోయాయి అని విమర్శించారు. మైనార్టీలపై కోతలు విధించే జగన్ రెడ్డికి త్వరలో ముస్లిం మైనార్టీలు వైఎస్ఆర్సీపికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ టిడిపి ఫ్లోర్ లీడర్ మహబూబ్ వలి, జిఎం గౌస్, 1 వ వార్డు కౌన్సిలర్ నాగార్జున, 7వ వార్డు టిడిపి ఇన్చార్జ్ జియా, టిడిపి నాయకులు వారిష్, గుల్లి,హమీద్, ఆయుబ్, టిడిపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Back to top button