
మైనారిటీలకు పచ్చి మోసం దుల్హన్ పథకం అమలుపై ధోకా
మైనారిటీలకు పచ్చి మోసం దుల్హన్ పథకం అమలుపై ధోకా
నంద్యాల (ఆంధ్రప్రతిభ) 24 జూన్: జిల్లా స్థానిక గాంధీ చౌక్ నందు SDPI పార్టీ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో YSRCP ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం అభివృద్ధి పథకాలు దుల్హన్ పథకం అమలుకు చేతులెత్తేయడంపై నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. SDPI పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హాఫీస్ అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ 2019 ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఎన్నో వాగ్దానాలు చేశారని అందులో దుల్హన్ పథకం , యువతకు స్వయం ఉపాధి , విదేశీ విద్య , ఇస్లామిక్ బ్యాంకు లాంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలుపై మేనిఫెస్టోలో నాడు హామీలే హామీలు ఇచ్చి నేడు కోతలే కోతలు చేస్తూ మైనారిటీల సంక్షేమం అభివృద్ధి పథకాలు అమలుపై ప్రభుత్వం చేతులెత్తేయడం తగదన్నారు. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమద్ మాట్లాడుతూ YSRCP అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు ఎన్నో పథకాలు ప్రకటించి ఓట్లు దండుకుని ఇప్పుడు ఆ పథకాలు అమలు చేతులెత్తేయడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అడుగుజాడల్లో నడుస్తున్నారని ధ్వజ మెత్తారు గత ప్రభుత్వం 50,000 ఇచ్చేదాన్ని తను ముఖ్యమంత్రి అయ్యాక లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి రెండున్నర సంవత్సరాలు ముస్లిం మహిళలకు మభ్యపెట్టి ఇప్పుడు దులహన్ పథకం ఇవ్వలేమని ప్రకటించడం చాలా సిగ్గుచేటని ధ్వజమెత్తారు. SDPI పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫాజిల్ దేశాయి మాట్లాడుతూ మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మైనార్టీలపై దులహన్ పథకం అమలు చేయలేమని అని చెప్పడం మాట తప్పడం కాదా అని ప్రశ్నించారు పేదా ముస్లిం అమ్మాయిల వివాహాలకు దుల్హన్ పథకం ఇస్తానని చెప్పి వారి ఆశ చూపించి YSRCP ప్రభుత్వం మైనారిటీలకు చెప్పిన ఏ వాగ్దానాలు కూడా అమలు చేయకపోవడం ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముస్లిం మహిళలకు ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకోవడం ప్రజా ద్రోహం అవుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో SDPI పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు N.K. యూనుస్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్లా, SDPI పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ముళ్ల ఇస్మాయిల్, కార్యవర్గ సభ్యులు మునావర్ , నంద్యాల అసెంబ్లీ ట్రెజరర్ నోస్సం ఫారుక్ , కార్యవర్గ సభ్యులు అన్వర్ భాష , కరిముల్లా , అబ్దుల్ రజాక్ , అబ్దుల్ రెహమాన్ , మజీద్ ఖాన్ , మరియు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు