NandyalAbdul Javid

దులహన్ పథకాన్ని ప్రారంభించాలి –  జానో జాగో

దులహన్ పథకాన్ని ప్రారంభించాలి –  జానో జాగో

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 23 జూన్: దులహన్ పథకాన్ని ప్రారంభించాలని  జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక ) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం అమ్మాయిల పెళ్లి కోసం గత ప్రభుత్వంలో దుల్హన్ పథకం పేరుతో యాభై వేలు ఆర్థిక సహాయం చేసేది అప్పటి ప్రతిపక్షనేత ఇప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు మాట్లాడుతూ ముస్లిం అక్కాచెల్లెళ్లకు అన్నగా నేను అండగా ఉంటానని ముస్లిం అక్కాచెల్లెళ్లకు వైయస్సార్ దులహన్ పథకం పేరుతో లక్ష రూపాయలు ఇచ్చి ఒక అన్నగా ఆదుకుంటారని ఆనాడు అన్నారు తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఎంతవరకూ ఒక పైసా కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు కానీ నిన్ను హైకోర్టులో దుల్హన్ పథకానికి తమ దగ్గర డబ్బులు లేవని ఈ పథకాన్ని కొనసాగించడం రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారింది అని చెప్పి నారు గత ప్రభుత్వంలో 50 వేలు రూపాయలు ఇవ్వడం వల్ల పెళ్లి కూతురు వారి కుటుంబాల్లో కొద్దిగా ఆర్థిక భారం తగ్గేది అలాంటిది అలాంటిది నేను అధికారంలోకొస్తే లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి దానిని నమ్మి ముస్లిం సమాజం అక్కాచెల్లెళ్లు అందరూ జగన్మోహన్ రెడ్డి నమ్మి ఓటు వేసి గెలిపిస్తే వారు ఇచ్చే బహుమతి ఇదేనా అని ప్రశ్నించారు.  ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి మనసు మార్చుకుని పథకాన్ని కొనసాగించాలని లేకపోతే రాబోవు రోజుల్లో ముస్లిం సమాజం గుణపాఠం చెబుతుందని వారు అన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks