NandyalAbdul Javid

ముస్లింల ద్రోహి – సీఎం పదవికి రాజీనామా చేయాలి

  • అవగాహన లేని జగన్ మోహన్ రెడ్డి
  • ముస్లింల ద్రోహి జగన్మోహన్ రెడ్డి
  • సీఎం పదవికి రాజీనామా చేయాలి
  • తెలుగుదేశం పార్టీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 23 జూన్: పట్టణంలో గురువారం తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా  ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చే 50,000 కాకుండా వైసీపీ ప్రభుత్వం వస్తే లక్ష రూపాయలు ఇస్తానని ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి ముస్లింలకు ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకుని తీరా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చాక దుల్హన్ స్కీం ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అనడం సిగ్గు చేయడని మౌలానా ముస్తాక్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ముస్లింల పట్ల వివక్ష చూపిస్తుందని తెలిపారు. ఎంత సేపు జగన్ రెడ్డి కి కూల్చే పనులే తప్ప అభివృద్ధి చెయ్యాలనే ఆలోచనే లేదని ఎద్దేవా చేశారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మైనార్టీ ప్రజలకు పెళ్లి కానుక కోసం దులహన్ పథకం 50 రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ జగన్ మోహన్ రెడ్డి నేను అధికారం వస్తేనే 50000 ఉండేది లక్ష రూపాయలు దులహన్ పథకం ఇస్తానని చెప్పి రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీ ప్రజలకు మోసం చేశారని వారు తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపణ చేశారు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గడపగడపకు వస్తున్న ఎమ్మెల్యేలకు మంత్రులకు కు రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనార్టీ ప్రజలు నిలదీయాలని మౌలానా ముస్తాక్ అహ్మద్ తెలిపారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు గద్దె దింపుతారు అని తెలిపారు.

Back to top button