NandyalAbdul Javid

SDPI పార్టీ నూతన నంద్యాల జిల్లా కమిటీ ఎన్నిక

SDPI పార్టీ నూతన నంద్యాల జిల్లా కమిటీ ఎన్నిక

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 22 జూన్: జిల్లా స్థానిక పార్టీ కార్యాలయంలో SDPI పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హాఫీస్ అతావుల్లా ఖాన్ గారి అధ్యక్షతన ఎన్నిక ప్రక్రియ ద్వారా SDPI పార్టీ నంద్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన SDPI పార్టీ నంద్యాల జిల్లా కార్యవర్గం ప్రెసిడెంట్  మహబూబ్ బాషా, వైస్ ప్రెసిడెంట్ లింకన్ రాజు, జనరల్ సెక్రటరీ కరిముల్లా,  ఇస్మాయిల్ భాష , సెక్రటరీ  ఇక్బాల్ భాష , ట్రెజరర్ మహమ్మద్ అలీ, కార్యవర్గ సభ్యులుగా  జాఫర్  హుస్సేన్,  హరుణ్ రషీద్ , అబ్దుల్ రెహమాన్ , మునవర్ భాష , అబ్దుల్ రహీం ఎన్నికయ్యారు నూతనంగా ఎన్నికైన SDPI  పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మహబూబ్ బాషా మాట్లాడుతూ తనకు దక్కింది పదవి కాదని బాధ్యత అని ఎన్నికైన నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి త్వరలో నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేసి SDPI పార్టీని మరింత బలోపేతం చేసి  రానున్న రోజులలో SDPI పార్టీ బలమైన శక్తిగా ఎదిగి ముందుకు సాగుతోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో SDTU జాతీయ కార్యవర్గ సభ్యులు మహమ్మద్ హనీఫ్, SDPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫాజిల్ దేశాయ్, నంద్యాల అసెంబ్లీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు

Back to top button