NandyalAbdul Javid

జల్సా – ఎ – షాన్ ఎ – ముస్తఫా (స అ వ)బహిరంగ సభను జయప్రదం చేయండి

జల్సా – ఎ – షాన్ ఎ – ముస్తఫా (స అ వ)బహిరంగ సభను జయప్రదం చేయండి

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 17 జూన్ : నంద్యాల జామియా మస్జిద్ నందు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కర్నూలు జిల్లా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ డాక్టర్ మౌలానా ఖాజి అబ్దుల్ మజీద్ మరియు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు S.Md. అబులైస్ ఆధ్వర్యంలో 18. 6 .2022 శనివారం రోజున కర్నూలు, ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ నందు సాయంత్రం 5గం నుండి రాత్రి 10 గం ల వరకు జరపబోయే జల్సా- ఎ – షాన్ ఎ – ముస్తఫా (సల్లల్లాహు అలైహి వసల్లం) అనే భారీ బహిరంగ సభ కు చెందిన గోడ పత్రికను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సభ నందు గొప్ప గొప్ప ఇస్లామిక్ పండితులు హాజరై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఆయన సీరత్ (వ్యక్తిత్వం) గురించి ప్రసంగించి ముస్లిమేతరుల అపోహలను తొలగిస్తారని కావున హిందూ ముస్లిం సోదరులు అత్యధిక సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రవక్త (స అ వ)గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన  నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ లను చట్టరీత్యా  కఠినంగా శిక్షించాలని, వారిని అరెస్ట్ చేయాలని, వీరి వ్యాఖ్యలను ప్రసారం చేసిన టీవీ ఛానళ్ల పై, ఆయా యాంకర్ లపై చట్టరీత్య చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.  ఈ కార్యక్రమంలో  తబ్లిక్ అమీరే జమాత్ ముఫ్తి రఫీ, అక్బర్ భాయ్, ఎస్డిపిఐ కరీముల్లా, ఐయూఎంఎల్ మౌలానా అబ్దుస్సలామ్, పాపులర్ ఫ్రంట్ ఏజాస్ హుస్సేన్, ఇద్రిస్ షేక్,  జమీయతే ఉలేమా మౌలానా ఖలీల్ అహ్మద్, సున్ని జమాత్ సయ్యద్ చాంద్ పీర్ సాహెబ్, జమతే ఇస్లామ్ హింద్ సద్దాం,  కాంగ్రెస్ మస్తాన్ ఖాన్, కర్నూలు జిల్లా ఆల్ మేవా ప్రెసిడెంట్ రియాజ్ బాషా, రెడ్క్రాస్ డాక్టర్ దస్తగిరి, కోహినూర్ మహబూబ్ బాషా, యం హెచ్ పి ఎస్ ముల్లా ఖాజా హుస్సేన్, రిటైర్డ్ ఆర్టిసి పిఎ ఖాన్,  జబ్బార్, అస్సద్ , రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button