NandyalAbdul Javid

అత్మహత్య చేసుకున్న అర్టీఓ ఏజెంట్ కరీముల్ల కుటుంబానికి ఆర్థిక సహాయం

నంద్యాలలో అత్మహత్య చేసుకున్న అర్టీఓ ఏజెంట్ కరీముల్ల కుటుంబానికి ఆర్థిక సహాయం

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 15 జూన్:  నంద్యాల పట్టణంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ బుధవారం నాడు కరీముల్లా కుటుంబ సభ్యులకు 50,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ కరీముల్లా ఆత్మహత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు .రాష్ట్ర ప్రభుత్వం కరీముల్లా కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. కరీముల్లా పిల్లలకు చదువుకయ్యే ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. కరిముల్లా భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. కరిముల్లా కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. కరిముల్లా కుటుంబానికి న్యాయం చేయకపోతే పోరాటం చేస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మనియర్ ఖలీల్ టిడిపి మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫరూక్, నంద్యాల టిడిపి 34 వ వార్డ్ కౌన్సిలర్ వలి, 35 వ వార్డు ఇంచార్జ్ షేక్ నూర్ భాషా, టీడీపీ నాయకులు రషీద్, ఖాజా ఫరీద్, హమీద్, తదితరులు పాల్గొన్నారు

Back to top button