NandyalAbdul Javid

కరీముల్లా కుటుంబానికి న్యాయం చేయాలి

కరీముల్లా కుటుంబానికి న్యాయం చేయాలి

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 14 జూన్: పట్టణంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో కరీముల్లా ఆత్మహత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ రిలే దీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్యాలేట్ బ్యూరో సభ్యులు ఎండి ఫరూక్, తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ కరిముల్లా ఆత్మహత్యకు కారకులైన ఆర్టిఓ అధికారులను కఠినంగా శిక్షించాలి వారు డిమాండ్ చేశారు.

  • రాష్ట్ర ప్రభుత్వం కరీముల్లా కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి.
  • కరీముల్లా పిల్లలకు చదువుకయ్యే ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.
  • కరిముల్లా భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
  • కరిముల్లా కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలి.

రిలే దీక్షలు చేపడితే నంద్యాల డిఎస్పి అడ్డుకోవడం జరిగింది. కరిముల్లా కుటుంబానికి న్యాయం చేయకపోతే పోరాటం చేస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మనియర్ ఖలీల్, తెలుగు దేశం పార్టీ మైనార్టీ పార్లమెంటు అధ్యక్షులు కరిముల్లా, జిఎం గౌస్, నంద్యాల టిడిపి 34 వ వార్డ్ కౌన్సిలర్ వలి, టిడిపి కౌన్సిలర్లు శ్రీదేవి, దూదేకుల జైనబ్ బి, 35వ వార్డు ఇంచార్జ్ షేక్ నూర్ భాషా, 7 వార్డు ఇన్చార్జి జియా, అతర్ మహమ్మద్ పర్వేజ్ గడివేముల ఫారుక్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks