NandyalAbdul Javid

 పోలీస్ స్పందన కార్యక్రమానికి 92 ఫిర్యాదులు

 పోలీస్ స్పందన కార్యక్రమానికి 92 ఫిర్యాదులు

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 13 జూన్: జిల్లా బొమ్మలసత్రం వద్దగల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం “స్పందన” కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో సామాన్య ప్రజలు వివిధ రకాల కారణాలతో వచ్చే బాధితుల సమస్యలు నేరుగా తెలుసుకోవడం ద్వారా వాటి త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా సమస్యల సత్వర పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి అదేశాలమేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్  R. రమణ “స్పందన ” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదిదారుల సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి చట్ట పరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలు సత్వరమే  పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులలో కుటుంబ కలహాలు, అన్నదమ్ముల మధ్య ఆస్థి తగాదాలు, అత్తారింటి వేధింపులు, సివిల్ తగాదాలు ఉన్నాయి. ఓంకారం దేవస్థానం వారు వచ్చిన ఫిర్యాదిదారులకు బోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ తోపాటు, SI రాజ్ కుమార్ పాల్గొన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks