Nandyal

సోనియా గాంధీ రాహుల్ గాంధీ ల పై పెట్టిన అక్రమ ED కేసులను వెంటనే ఎత్తి వేయాలి  – కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య

సోనియా గాంధీ రాహుల్ గాంధీ ల పై పెట్టిన అక్రమ ED కేసులను వెంటనే ఎత్తి వేయాలి  – కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 13 జూన్: కేంద్ర ప్రభుత్వము అక్రమంగా కాంగ్రెస్ నాయకుల పై.ఈడి.కేసులు పెట్టి అక్రమం గా పెట్టిన కేసులు ఎత్తివేయాలని నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిజెపి ప్రభుత్వమొండి వైఖరిని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఊకొట్టు వాసు నంద్యాల పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య మాట్లాడుతు ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పై నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబందించిఇడి ఎదుట హాజరు కావాలని ఈ ప్రభుత్వం (బిజెపి) కాంగ్రెస్ నాయకులు పై గతంలో కోర్టు లు కేసులు అన్నియు కొట్టి వేయడం జరిగింది ఇప్పుడు ప్రధాని. నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కేసు ను తిరుగ తోడి అక్రమంగా ఈడీ కేసులు పెట్టడం జరిగిందని అందుకు నిరసనగా ఈ రోజు డిల్లీ లో ఏఐసీసీ కార్యాలయం నుండి E. D. ఆఫీస్ వరకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నాయకులు నడుచుకుంటూ నిర్వహించడం జరిగింది. దీనికి సంగిభావంగా నూనెపల్లె లో ఓవర్ బ్రిడ్జి దగ్గర నిరసన జరుపడం జరిగింది. కాంగ్రెస్ జిందాబాద్ రాహుల్ జిందాబాద్ బిజెపి ప్రభుత్వం డౌన్ డౌన్ అని నినాదాలు చేయడం కాంగ్రెస్ నాయకులపై కేసులు ఎత్తి వేయాలని కేంద్రం ప్రభుత్వని కోరడమైనది ఈ కార్యక్రమం లో నంద్యాల అధ్యక్షులు దాసరి చింతలయ్య రాష్ట్ర అధికార ప్రతినిధి ఉకోటు వాసు కోడినేటర్ ఫరూక్ ట్రెజరర్ ప్రసాద్ మాసూమ్ రత్నయ్య జాకీర్ సుబ్బయ్య కృష్ణ శివ రెడ్డి సుబ్బారాయుడు మొదలగు కాంగ్రెస్ కార్యకర్తలు పాలుగోన్నారు

Back to top button