NandyalAbdul Javid

ఉచిత మెగా వైద్య శిబిరం

ఉచిత మెగా వైద్య శిబిరం

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 12 జూన్: ఆల్ మేవ నంద్యాల జిల్లా మరియు కిమ్స్ కర్నూలు వైద్యశాల ఆధ్వర్యంలో 200 మందికి పైగా అవసరార్థులకు పలు విభాగాల్లో ఉచిత మెగా వైద్య అందించడం జరిగింది వివరాల్లోకి వెళితే  ఆల్మేవా    ఆల్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కిమ్స్ వైద్యశాల సంయుక్తంగా ఈ రోజు ఉదయం 10 గం,, నుండి 3గం,, వరకు నంద్యాల నడిగడ్డ చింతఅరుగు దగ్గర లోని మాస్టర్ పబ్లిక్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో   కిమ్స్ వైద్య ప్రత్యేక బృందం తో 2D ECHO, ECG, BP, SUGAR TEST, లాంటి పరీక్షలు మరియు డాక్టర్ పి కిరణ్ కుమార్ ఆర్థోపెడిషియన్, డాక్టర్ చింత రాజ్ కుమార్ కార్డియాలజిస్ట్, డాక్టర్ పొట్టి వెంకట చలమయ్య పల్మోనోలజిస్ట్, డాక్టర్ వసీం హసన్ షేక్ జనరల్ సర్జన్ మరియు ఫిజిషియన్ ల కన్సల్టేషన్షన్ లు ఉచితంగా చేయబడ్డాయి దాదాపు 200 మందికి పైగా ప్రజలకు, ఉద్యోగస్తులకు  రిటైర్డ్ ఉద్యోగస్తులకు సేవలు అందించడం జరిగింది ఈ ఉచిత మెగా వైద్య శిబిరం లో మాస్టర్ పబ్లిక్ స్కూల్ చుట్టుప్రక్కల ప్రజలు మరియు పలు వీధుల నుండి ప్రజలు విరివిగా పాల్గొని తమ తమ ఆరోగ్య సంబంధిత పరీక్షల ద్వారా ప్రయోజనాన్ని పొందారు ఆల్ మే వా ముఖ్య గౌరవ సలహాదారులు S.Md. అబులైస్ మాట్లాడుతూ ఉచితంగా చేసే ఈ పరీక్షల ద్వారా మనకు తెలియని ఏవైనా సమస్యలు ఉండి మనం చేసే నిర్లక్ష్యం కారణంగా సంభవించే హఠాత్ ఆరోగ్య సంబంధ సమస్యలను, ఇటువంటి సేవలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా నివారించవచ్చు అని తెలియజేశారు. నంద్యాల జిల్లా అధ్యక్షులు ఇమ్రాన్ పాష మాట్లాడుతూ కిమ్స్ వైద్యులకు తమ అమూల్యమైన సమయాన్ని మరియు సేవలను అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పేరులోనే వెల్ఫేర్ ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ వెల్ఫేర్ ఆక్టివిటీస్ ఉద్యోగస్తులు సమాజంలో తమ శక్తి మేరకు సేవా కార్యక్రమాలను అందిస్తూ ఉంటారని దీనిలో భాగంగానే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీడీవో నందికొట్కూర్ మహబూబ్ ఖాన్ , అలీపిరా  జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ పి డి, డ్వామా, డాక్టర్ జఫరుల్లా అడిషనల్ ఛార్జ్ డి సి హెచ్ ఎస్,  మాస్టర్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ దస్తగిరి , జమాతే ఇస్లామి హింద్ అధ్యక్షులు సమద్ మరియు కిమ్స్ ప్రత్యేక వైద్యులు తగు రీతిలో ఆరోగ్య విలువలను సూచించారు వీరికి ఆల్ మేవ తరపున  ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆల్ మేవా గౌరవాధ్యక్షులు సమద్ ఆల్ మే వా సభ్యులు జాకీర్ హుస్సేన్ మునీర్ అమీరుద్దీన్ షోయబ్బుజ్  మాస్టర్ పబ్లిక్ స్కూల్  బృందం పాల్గొన్నారు

Back to top button