NandyalAbdul Javid

హజ్ యాత్రికులకు ఘనంగా వీడ్కోలు పలికిన జమాఆతె ఇస్లామీ హింద్ ప్రపంచ శాంతి కోసం ప్రార్థించండి

హజ్ యాత్రికులకు ఘనంగా వీడ్కోలు పలికిన జమాఆతె ఇస్లామీ హింద్ ప్రపంచ శాంతి కోసం ప్రార్థించండి

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 11 జూన్: 2022 సంవత్సరం నంద్యాల నుండి హజ్ యాత్రకు వెళ్ళె హాజీలకు జమాఆతె ఇస్లామి హింద్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో అంటి కోట మస్జిద్ లో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. జమాఆతె ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యదర్శి మౌలానా హాఫీజ్ షౌఖత్ ఫహీం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు సీ. ఇసాక్ బాషా, స్థానిక అధ్యక్షులు అబ్దుల్ సమద్, జేఎసి అధ్యక్షులు ముహమ్మద్ అబులైస్, హాఫీజ్ ఇసాక్, పలువురు కౌన్సిలర్లు, హజ్ యాత్రికులు తదితర నాలుగు వందల మంది స్త్రీ పురుషులు పాల్గొన్నారు. సయ్యద్ జమీలుద్దీన్ కన్వీనర్ గా వ్యవహరించారు. హాఫీజ్ హబీబుల్లా ఖుర్ఆన్ పారాయణం తో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో  ఫహీం హజ్ ఔన్నత్యం వివరిస్తు, అన్ని త్యజించి, రెండు గుడ్డలు కప్పుకుని నిరాడంబరంగా మక్కా పవిత్ర యాత్రకు వెళ్ళేవారు ఎంతో నిష్టతో హాజ్ ఆచరిస్తారని, దైవానుగ్రహము కల్గిన వారే హాజ్ చేస్తారన్నారు. సమద్ మాట్లాడుతూ  ప్రపంచ వ్యాప్తంగా తరతమ భాషా బేధాలు మరిచి ప్రపంచ నలుమూలల నుండి ఒకేసారి దైవగృహం సందర్శించి ప్రదక్షించె సన్నివేశం ఓ చారాత్రిక ఘట్టం అని, హాజీల ప్రార్ధనలు అల్లాహ్ అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రపంచ శాంతి కోసం మరీ ముఖ్యంగా భారత దేశం సుభిక్షంగా ఉండాలని, మతసామరస్యం వెల్లివిరియాలని ప్రార్థించమని హజ్ యాత్రికులకు అభ్యర్థించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీ.ఇసాక్ బాషా ఎంఎల్సీ మాట్లాడుతూ తాను దైవ కృపవల్ల ఈ సంవత్సరం హాజ్ యాత్ర వెళుతున్నట్లు నిజంగా పవిత్ర మక్కా సందర్శన తనలో ఓ విచిత్ర అనుభూతికి లోను చేస్తుంది, హాజ్ చేయాలన్నా తపన , ఆరాటం అల్లాహ్ తప్పక గుర్తిస్తాడని, తప్పకుండా అందరు నంద్యాల గురించి ప్రార్ధిస్తాం అన్నారు. అబులైస్ మాట్లాడుతూ విభిన్న కార్యక్రమాల ద్వారా జమాఆతె ఇస్లామీ హింద్ సమాజం లోని ప్రజలందరి హృదయాలు చూరగోంటుందన్నారు. అనంతరం హాజీలకు ముఖ్య అతిథితో శాలువాలు కప్పి సత్కరించారు. మహిళలకు మహిళా కౌన్సిలర్లు శాలువాలు కప్పి సన్మానించారు. హాఫిజ్ ఇసాక్ దువా చేసారు.

Back to top button
Enable Notifications    OK No thanks