Nandyal

కరీముల్లా కుటుంబానికి న్యాయం చేయకపోతే పోరాటాలకు సిద్ధం

  • కరీముల్లా కుటుంబానికి న్యాయం చేయకపోతే పోరాటాలకు సిద్ధం
  • తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 09 జూన్: కరిముల్లా ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్న తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలోని కరిముల్లా నివాసానికి వెళ్లిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్. రాష్ట్రంలో జరుగుతున్న మైనారిటీలపై దాడులు తగ్గాలంటే సి.ఎం జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీపార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 3 సంవత్సరాల కాలం అయ్యింది ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీల మీద దాడులు చేయడం సిగ్గుచేటని మైనార్టీ ఓట్లు వేయించుకొని మైనార్టీల మీద దాడులు చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు. వైసిపి నాయకులు మైనార్టీ లో ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారని మైనార్టీలు ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో వీరి ఆగడాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అధికారులు కూడా ఆత్మహత్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కరీముల్లా మృతికి కారకులైన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని మరియు రాష్ట్ర ప్రభుత్వం కరిముల్లా కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, కరీముల్లా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, కరిముల్లా పిల్లల చదువు ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. రాష్ట్రప్రభుత్వం ఈ ఘటనపై స్పందించకపోతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొని వెళ్లి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేపడతామన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో దేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మనియర్ ఖలీల్, టిడిపి మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫరూక్, జి.యం.గౌస్, 35 వ వార్డు ఇంచార్జ్ నూర్ భాషా, 39 వ వార్డు ఇంచార్జి ఎం ఎండి రఫీ, టిడిపి సీనియర్ నాయకులు మస్తాన్ బాబా, రషీద్, ఫరీద్ , టిడిపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks