NandyalAbdul Javid

జగత్ ప్రవర్త ముహమ్మద్ (SAW) పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సహించము – SDPI

జగత్ ప్రవర్త ముహమ్మద్ (SAW) పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సహించము – SDPI

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 09 జూన్: SDPI పార్టీ నంద్యాల అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి షేక్ కరిముల్లా అధ్యక్షతన నంద్యాల జిల్లా స్థానిక గాంధీ చౌక్ నందు మహాప్రవక్త ముహమ్మద్ (SAW) గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి నాయకులను వెంటనే అరెస్టు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టిన SDPI పార్టీ నంద్యాల అసెంబ్లీ నాయకులు SDPI పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫాజిల్ దేశాయి మాట్లాడుతూ బిజెపి స్పోక్స్ పర్సన్ నుపూర్ శర్మ మీడియా డిబేట్ లో జగత్ ప్రవర్త ముహమ్మద్ సొల్లెల్లాహు అలైహి వసల్లం గారి గౌరవాన్ని భంగం కల్గించే వాఖ్యలు చేయడాన్ని ఆరోపణలు చేయడం చాలా దిగ్భ్రాంతిని కల్గించిందని మరియు దీనిని మేము పూర్తిగా ఖండిస్తున్నామని ప్రవక్త గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు అబులేస్ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం ప్రకారం మరియు యూనివర్సల్ మానవహక్కుల చట్టం ప్రకారం అన్ని మతాల  ప్రవక్తల ను గౌరవించడం అందరి విధి.ఏదైనా మతం యొక్క ప్రవక్తను లేదా గురువును అగౌరపరచటం లేదా పరువు ప్రతిష్టలను దెబ్బతీయడం తీవ్రమైన నేరపూరితమైన చర్య.దీనిని ఏవిధంగానైనా అంగీకరించము. ఏ ముస్లిము సహించడు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ముస్లిముల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి నేరస్తుల పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మౌలానా అబ్దుల్లా , PFI  నంద్యాల డివిజన్ అధ్యక్షులు ఎజాస్ హుస్సేన్,  సెక్రటరీ ఇద్రీస్ షేక్ , SDPI పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇక్బాల్ భాష SDPI పార్టీ నంద్యాల అసెంబ్లీ ట్రెజరర్ నొస్సం ఫారుక్ , కార్యవర్గ సభ్యులు అబ్దుల్ రజాక్ , మాజిద్ ఖాన్ , అన్వర్ భాష , కరిముల్లా , మరియు నంద్యాల ఉలమాలు,  యువత , ముస్లిం పెద్దలు , ప్రజలు పాల్గొన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks