NandyalAbdul Javid

రూట నంద్యాల రీజనల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా అంజాద్ బాషా, హనీఫ్ లు ఏకగ్రీవం

  • రూట నంద్యాల రీజనల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా అంజాద్ బాషా, హనీఫ్ లు ఏకగ్రీవం
  • జిల్లా ఎన్నికల అధికారి జమాన్

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 08 జూన్: రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ నంద్యాల రీజనల్ అధ్యక్షలు గా నంద్యాల లోని ఖలీల్ సిద్దీఖి ఉన్నత పాఠశాల ఉర్దూ పండితులు హాఫిజ్ కే. ఏ. అంజాద్ బాషా, ప్రధాన కార్యదర్శి గా  నంద్యాల పురపాలక పాఠశాల ఉపాధ్యాయులు హనీఫ్ , ఆర్థిక కార్యదర్శి గా బి ఎఫ్ సి ఏయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులు అబ్దుల్లా లను ఏక్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర సీనియర్ నాయకులు  జిల్లా ఎన్నికల అధికారి వజిహుజ్ జమాన్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక రూట కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు జి కే కలీమ్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల పరిశీలకులు గా జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగీర్ బాషా వ్యవహరించారు. రీజనల్ శాఖ అసోసియేట్ అధ్యక్షులు గా జాఫర్ హుసేన్ , ఉపాధ్యక్షులు గా ఫయాజ్ అలి, అదనపు ప్రధాన కార్యదర్శి దర్వేష్ ఖాదరి, మహిళ కార్యదర్శి రిజ్వాన బేగం, కార్యదర్శి కె అహ్మద్ హుసేన్, సహాయ ఆర్థిక కార్యదర్శి మస్తాన్ వలీ లను ఎన్నుకున్నారు. జిల్లా శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్రియ అలి ఖాన్, ఆర్థిక కార్యదర్శి ముల్లా మహబూబ్ బాషా లు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

Back to top button
Enable Notifications    OK No thanks