NandyalAbdul Javid

గణతంత్రాన్ని కాపాడండి

గణతంత్రాన్ని కాపాడండి

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 05 జూన్: గణతంత్రాన్ని కాపాడండి అను నినాదంతో జనవరి 26నుండి ఆగష్టు 15 వరకు దేశ వ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ నిర్వహిస్తున్న క్యాంపైన్ లో భాగంగా నంద్యాల లో జూన్ 4,5 న కార్యకర్తలకు క్యాంపైన్ యొక్క విధానాలపై అవగాహనా కల్పించడం జరిగింది. ఇందులో స్వాతంత్ర సమరయోధుల చరిత్ర, రాజ్యాంగపు హక్కులు, ప్రజాసత్సంబంధాలు, న్యాయ అవగాహనా, మొదలగు తరగతులను వివరించారు. ఈ కార్యక్రమంలో పాపులర్ ఫ్రంట్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుస్సేన్ పీరా మాట్లాడుతూ భారత రాజ్యాంగ విలువలను, హక్కులను కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు కృషి చేయాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు ఏజాస్ హుస్సేన్, కౌన్సిల్ సభ్యులు రిజ్వాన్, షేక్షావలి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks