NandyalAbdul Javid

సకాలం లో ఉర్దూ మీడియం పుస్తకాలు అందించండి- రూట

సకాలం లో ఉర్దూ మీడియం పుస్తకాలు అందించండి- రూట

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 04 జూన్: రాష్ట్రం లోని ఉర్దూ మీడియం పాఠశాలల విద్యార్థులకు సకాలంలో ఉర్దూ మరియు ఇంగ్లీష్ భాషలతో కూడిన మిర్రర్ ఇమేజ్ పాఠ్య పుస్తకాలు అందించాలని రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జమాన్ రాష్ట్ర ప్రభత్వానికి కోరారు. శనివారం ఉదయం నంద్యాల జిల్లా రూట  అధ్యక్షులు జి కే కలీమ్ అధ్యక్షతన స్ధానికంగా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రూట రాష్ట్ర  కార్యదర్శి జమాన్ మాట్లాడుతూ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ వారు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం లేదని , వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందించాలని డిమాండ్ చేశారు. సభ అధ్యక్షులు కలీమ్ మాట్లాడుతూ రాష్ట్రం లోని ఇతర పురపాలక, నగర పాఠశాలలలో విద్యా వాలింటర్లు మంజూరు చేశారని కానీ నంద్యాలలో నియమించకపోవడంతో అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు ఎంతో ఇబ్బంది పడ్డారని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుండే విద్యా వాలంటీర్లు నియమించాలని పురపాలక సంఘంకు కోరారు. సభ కు హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగీర్ బాషా మాట్లాడుతూ నూతన విద్యా విధానం లో భాగంగా ఉర్దూ మీడియం అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని , ఉన్నత పాఠశాలలకు ఉన్నతి కరించి కళాశాలల గా అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి ముల్లా మహబూబ్ బాషా, జిల్లా  నాయకులు కలీముల్లా, సైఫుల్లా తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks