
ఘనంగా ముగిసిన SDPI పార్టీ క్రికెట్ టోర్నమెంట్
ఘనంగా ముగిసిన SDPI పార్టీ క్రికెట్ టోర్నమెంట్
నంద్యాల (ఆంధ్రప్రతిభ) 31 మే: SDPI పార్టీ అధ్వర్యంలో కానాల గ్రామంలో నంద్యాల జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ లో 32 టీమ్ లు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ లో మొదటి బహుమతి నంద్యాల టీం , రెండవ బహుమతి కానాల టీం , మూడవ బహుమతి చెన్నూరు టీం లు గెలుపొందాయి. టోర్నమెంటులో గెలుపొందిన విజేతలకు SDPI పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ N.K. యూనుస్ , కర్నూలు జిల్లా అధ్యక్షులు జహంగీర్ అహ్మద్, కర్నూలు జిల్లా వైస్ ప్రెసిడెంట్ లింకన్ రాజు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎజాస్ హుసేన్, విన్నింగ్ టోపీ మరియు నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. కర్నూలు జిల్లా అధ్యక్షులు జహంగీర్ అహ్మద్ మాట్లాడుతూ క్రీడలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడడం వల్ల మనశరీరం ఎంతో చురుకుగా ఉంటుంది ఇలాంటి క్రీడలు కానాల గ్రామ SDPI పార్టీ నాయకులు నిర్వహించడం చాలా సంతోషకరం యువకులు కూడా చెడు అలవాట్ల వైపు పోకుండా ఇలాంటి క్రీడా పోటీలలో పాల్గొని విజేతలుగా గెలిచి మన జిల్లా , మరియు రాష్ట్ర వ్యాప్త క్రీడా పోటీలలో పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో SDPI పార్టీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఫాజిల్ దేశాయి, కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి మహబూబ్ బాషా, కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యులు ఇక్బాల్ భాషా, ముల్లా ఇస్మాయిల్, కర్నూలు సిటీ ప్రెసిడెంట్ అశ్వక్ హుసేన్, నంద్యాల అసెంబ్లీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, ప్రధాన కార్యదర్శి షేక్ కరీముల్లా, కార్యవర్గ సభ్యులు మాజిద్ ఖాన్, అబ్దుల్ రజాక్, అన్వర్ భాషా, కానాల గ్రామ నాయకులు అనంత మా భాష, తగ్గుపాటి హసన్ మరియు కానాల గ్రామ కార్యకర్తలు , క్రీడాకారులు పాల్గొన్నారు