NandyalAbdul Javid

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టు చదరంగం ఎంపిక పోటీలు

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టు చదరంగం ఎంపిక పోటీలు

నంద్యాల (ఆంధ్ర ప్రతిభ) 30 మే: ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ గీతం యూనివర్సిటీ లో నిర్వహించనున్న గ్రాండ్ మాస్టర్  ఇంటర్నేషనల్ చదరంగం పోటీలలో కర్నూలు, నంద్యాల జిల్లాల జట్టు తరఫున పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేయడం కోసం ఆదివారం కర్నూల్, నంద్యాల జిల్లాల చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  ఎన్ ఆర్ జి నంద్యాల చెస్ అకాడమీ నిర్వహణలో స్థానిక నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో చదరంగం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అల్ కర్నూలు చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఐ ఎమ్ ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ, నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ నెరవాటి కృష్ణ సాయి రోహిత్, ప్రిన్సిపల్ అనిల్ కుమార్ అతిథులుగా పాల్గొని పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి రామసుబ్బారెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ పోటీలలో 100మంది చదరంగం  క్రీడాకారులు కర్నూలు నంద్యాల జిల్లాల నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు వైజాగ్ గీతం విశ్వవిద్యాలయం లో జరిగే టోర్నమెంట్లో ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్స్ తో ఆడే అవకాశం లభిస్తుందని, తద్వారా వారి ఆటను మెరుగుపరచుకోవడానికి గొప్ప అవకాశం ఉంటుందన్నారు. చదరంగం క్రీడాకారులు ఏకాగ్రతతో, క్రమశిక్షణ తో నిరంతరం సాధన చేస్తే విజయాలు లభిస్తాయని అన్నారు. నెరవాటి కృష్ణ సాయి రోహిత్ మాట్లాడుతూ తమ పాఠశాలలో చదరంగం పోటీలను తరచు నిర్వహించడానికి సహకారం అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా క్రీడల నిర్వహణకు తమ వంతు సహకారం అందజేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో చదరంగం శిక్షకులు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks