NandyalAbdul Javid

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 21 మే: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి సందర్బంగా నంద్యాల టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య అధ్యర్యంలో రాజీవ్ గాంధీ చిత్ర పటము నకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశం మునకు రాజీవ్ గాంధీ తల్లి ఇందిరా గాంధీ మరణించిన తరువాత అతి చిన్న వయసులోనే ప్రధాని గా మన దేశానికీ సేవలు సంస్కరణల చేసి అంతర్జాతీయ టెక్నాలజీ ని ప్రవేశపెట్టి ఈ రోజు మనం వాడుతున్న సెల్ ఫోన్ ప్రవేశపెట్టి మరియు పల్లెలకు సర్పంచ్ లకు చెక్ పవర్ ఇచ్చిన ప్రధాని నిధులను అందించి భారత దేశంను ముందుకు నడిపిచిన కుటుంబం గాంధీ కుటుంబం  అని దాసరి చింతలయ్య అన్నారు. రాజీవ్ గాంధీని 1991 మే నేల 21వ తేది న తమిళనాడు రాష్ట్ర ములో ని శ్రీ పెరంబదూర్ గ్రామం నందు మానవ బాంబ్ రూపంలో అయన ను చంపడం జరిగింది అని అయన అన్నారు. ఈ కార్యక్రమం నకు అధికార ప్రతినిధి ఉకోటు వాసు, ఫరూక్, ట్రెజరర్ ప్రసాద్, ఉపాధ్యక్షులు ఆనంద్ రావు, అహమద్, రత్నయ్య, బాష, ఇస్మాయిల్, కాంగ్రెస్ కార్యకర్తలు పాలుగోన్నారు

Back to top button