Nandyal

అన్నప్రసాద వితరణ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది – ఎంపి

అన్నప్రసాద వితరణ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 20 మే: అన్నప్రసాద వితరణ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందని ముఖ్య అతిథి గా విచేసిన ఎంపి పోచ బ్రహ్మానంద రెడ్డి కి సంస్థకు ధన్యవాదాలు తెలియజేసారూ. స్థానిక నంద్యాల పట్టణం లోని జిల్లా ఆసుపత్రి నందు గత కొన్ని సంవత్సరాలనుండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గురువారం అన్న ప్రజాద వితరణ కార్యక్రమానికి నంద్యాల ఎంపి పోచ బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ రోజు సహకరించిన దాత బలుస ఆదిత్య పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు డాక్టర్ రాజీవ్, డాక్టర్ ప్రశాంతి కి సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేసారు. ముఖ్యంగా ఇంత గొప్ప మైలురాయిని చేరడానికి కారణం దాతల దేవుళ్ళు ప్రత్యక్షంగా ఎంతోమంది దాతలు భగవంతుని రూపంలో వచ్చి అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ సంస్థ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారూ.

పరోక్షంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఈ కార్యక్రమం గురించి మీ పత్రికలో ప్రచురించి ప్రజల్లో కార్యక్రమం యొక్క స్ఫూర్తిని నింపి తద్వారా వారు దాతల రూపంలో సహకరించడం జరిగింది వారికి కూడా సంస్థ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రత్యక్షంగా ఎంతో మంది గౌర్నమెంట్ హాస్పిటల్ అన్ని విభాగాల సిబ్బంది లు మన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి కి సేవలందిస్తున్నారని, దాతలు ఉన్నారు కానీ దాన్ని స్వీకరించే వ్యక్తి కూడా గొప్పవాడే అని, వీరందరికీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అలాగే భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు సూచనలు కావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని అన్న ప్రసాద వితరణ సేవకుడు పెసల శ్రీకాంత్ తెలిపారు.

Back to top button