
రూట నంద్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కలీం, జక్రియా, దస్తగీర్
రూట నంద్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కలీం, జక్రియా, దస్తగీర్
హర్షం వ్యక్తం చేసిన ఉర్దూ ఉపాధ్యాయులు
నంద్యాల (ఆంధ్రప్రతిభ) 18 మే: రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ (రూట) నంద్యాల జిల్లా శాఖ అధ్యక్షలు గా నంద్యాల మండలం పోలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు జికే కలీమ్, కార్యనిర్వహక అధ్యక్షులు గా పురపాలక ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల (నదిగడ్డ) ఉపాధ్యాయులు ఎం.జక్రియ అలి ఖాన్, ప్రధాన కార్యదర్శిగా పురపాలక పాఠశాల ఉపాధ్యాయులు షేక్ దస్తగీర్ బాషా ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఉర్దూ ఉపాధ్యాయులు లు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కలీం, జక్రియ, దస్తగీర్, మహబూబ్ బాషా లు మాట్లాడుతూ ఉర్దూ పాఠశాలల, ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తామని, ఏకగ్రీవ ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అబ్దుల్ వారిస్, సయ్యద్ ఇక్బాల్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
- జిల్లా శాఖ ఆర్థిక కార్యదర్శి గా ముల్ల మహబూబ్ బాషా,
- అసోసియేట్ అధ్యక్షులుగా అతావుర్ రహ్మాన్ , షఫిఉల్ల, కలీముల్ల,
- ఉపాధ్యక్షులుగా జాని బాషా, గౌస్ అహ్మద్ , తాహిర్,
- అదనపు ప్రధాకార్యదర్సులు ఏహ్సానుల్ల ఖాన్, నయీముజ్జమ, హుసేన్ సాహెబ్ ,
- కార్యదర్శులు గా అబ్దుర్ రౌఫ్, గైబు అలి, రఫీ , సహాయ ఆర్థిక కార్యదర్శి గా సాలేహా
- మహిళ కార్యదర్శి గా గౌస్ బి లను ఎన్నుకున్నారు.
