Nandyal

జర్నలిస్టులు సమాజానికి మార్గ దర్శకులు

జర్నలిస్టులు సమాజానికి మార్గ దర్శకులు

  • – భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మానం
  • – పాత్రికేయులు నారద మహర్షిని ఆదర్శంగా తీసుకొవాలి
  • – జిల్లా విద్యాశాఖధికారి సత్యనారాయణ

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 17 మే: జర్నలిస్టులు సమాజానికి మార్గ దర్శకులని జిల్లా విద్యాశాఖధికారి సత్యనారాయణ పేర్కోన్నారు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో నంద్యాలలో పాత్రికేయులను ఘనంగా సన్మానించారు. నంద్యాల పట్టణంలో మంగళవారం స్వామి వివేకానంద ఆడిటోరియంలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో నారద జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖధికారి సత్యనారాయణ, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణా రెడ్డి, భారత్ వికాస్ పరిషత్ సౌత్ రీజినల్ జాయింట్ సెక్రెటరీ పబ్బు  బాలచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఇఓ సత్యనారాయణ మాట్లాడుతూ పాత్రికేయులు నారద మహర్షిని ఆదర్శంగా తీసుకొవాలన్నారు. సమాజానికి పాత్రికేయులు చేసున్న సేవలను వక్తలు కొనియాడారు.

పాత్రికేయుల ప్రతిభను గుర్తించి సన్మానం చేయడం మంచి పరిణామమన్నారు. జర్నలిస్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టిన వ్యక్తి నారద మహర్షి అని కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్ అన్నారు. మంచి, చెడును ప్రపంచానికి చాటి చెప్పే వారే పాత్రికేయులని,పాత్రికేయులకు చేస్తున్న సన్మానానికి అందరి తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈవో అనురాధ, సీనియర్ పాత్రికేయులు ప్రభాకర్ చౌదరి, మధు బాబు, ఉస్మాన్ భాష, శ్రీనివాసులు, కనక రాజు, భారత్ వికాస్ పరిషత్ నాయకులు నాగరాజారావు, బాలసుబ్రమణ్యం, దండే దస్తగిరి,  రామ్మోహన్, రామచంద్రారెడ్డి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దాదాపు 50 మంది పాత్రికేయులను భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి వారికి శాలువా కప్పి, పూలమాల వేసి, మేమొంటో తో ఘనంగా సత్కరించారు.

Back to top button
Enable Notifications    OK No thanks