Nandyal

ఎమ్మెల్సీ ఇస్ హాక్ బాషను ఘనంగా సత్కరించిన రూట నాయకులు

ఎమ్మెల్సీ ఇస్ హాక్ బాషను ఘనంగా సత్కరించిన రూట నాయకులు

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 16 మే: రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాయకులు జమాన్, రఖీబ్, ఆయ్యుబ్ కర్నూలు, నంద్యాల జిల్లా శాఖల నాయకులు మోయిన్ బాష, అహ్మద్ హుసేన్, జక్రీయ, దస్తగీర్, అతావుర్ రహ్మాన్ లు ఎమ్మెల్సీ ఇస్ హాక్ బాష ను ఘనంగా సత్కరించారు. ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ ఇస్ హాక్ బాష కార్యాలయం లో కలిసి ఉర్దూ పాఠశాలల, కళాశాలల విశ్వవిద్యాలయాల సమస్యలను విన్నవించారు. పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా మెటీరియల్ ను పంపిణీ చేయాలని కోరగా వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కి ఫోన్ చేయగా వచ్చే విద్యా సంవత్సరంలో తప్పకుండా అందజేస్తామని హామీ ఇచ్చారు. నాడు నేడు లో నంద్యాల  పురపాలక ఉర్దూ పాఠశాలలను చేర్చాలని కోరగా మున్సిపల్ చైర్ పర్సన్ మహబూన్నిస ను మాట్లాడి ఉర్దూ పాఠశాలలను నాడు నేడు  ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రూట జిల్లా శాఖ ఆర్థిక కార్యదర్శి ముల్ల మహబూబ్ బాషా, అసోసియేట్ అధ్యక్షులు అతావుర్ రహ్మాన్ , షఫిఉల్ల, కలీముల్ల, ఉపాధ్యక్షులుగా జాని బాషా, గౌస్ అహ్మద్ , తాహిర్, అదనపు ప్రధాకార్యదర్సులు ఏహ్సానుల్ల ఖాన్, నయీముజ్జమ, హుసేన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button