
ప్రమాదవశాత్తు వెన్నెముక దెబ్బతిన్న సంపత్ యాదవ్ కు దాతలు ఆదుకోవాలి
ప్రమాదవశాత్తు వెన్నెముక దెబ్బతిన్న సంపత్ యాదవ్ కు దాతలు ఆదుకోవాలి
నంద్యాల (ఆంధ్ర ప్రతిభ) 15 మే: నంద్యాల జిల్లా వైఎస్ఆర్ నగర్ లో అద్దె ఇంట్లో నివాసం ఉన్న నిరుపేద కుటుంబానికి చెందిన సంపత్ యాదవ్ హమాలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. హమాలీ పని చేస్తూ ఉన్నపుడు ప్రమాదవశాత్తు తను మోస్తున్న బియ్యం సంచి తో కింద పడడంతో వెన్నెముక మొత్తం దెబ్బతిని తన కాళ్లకు స్పర్శ లేకుండా మెరుగైన చికిత్స అందక మంచానికి అంకితమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. మురళి, సభ్యుడు హుస్సేన్ వలి నంద్యాలలోని దాత సి.ఉమర్ భాషా ఆర్థిక సహకారంతో ప్రశాంత్ యాదవ్ కు ప్రస్తుతం మెడిసిన్స్ కోసం ఆర్థిక సహాయం అందించారు. ఈ విధంగా సంపత్ యాదవ్ కు డాక్టర్ మెరుగైన చికిత్స ఇవ్వడానికి ప్రతి నెల ఇతని ఫిజియోథెరపీ కోసం 10500/- రూపాయలు ఖర్చు అవుతున్నది తన భార్య రమాదేవి తెలియజేశారు. ఇతనిది నిరుపేద కుటుంబం కావున ఇతని ఫిజియోథెరపీకి మరియు మెడిసిన్స్ కు దాతలు ముందుకు వచ్చి మీకు తోచినంత ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.