Nandyal

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ పెళ్లి కానుక ‌‌

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ పెళ్లి కానుక ‌‌

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 12మే: స్థానిక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నంద్యాల జిల్లా ఆత్మకూరు బస్టాండ్ హెడ్ ఆఫీస్ లో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నంద్యాల ఐదో వార్డులో మూడు మంది ఆడ పిల్లల పెళ్ళి ఫిక్స్ అయింది ఆ ముగ్గురు ఆడపిల్లలు తండ్రి లేని వారు వాళ్ల పెళ్లిళ్లకు వారి తల్లుల దగ్గర పెళ్లి కొరకు ఏమీ లేదు వచ్చే వారి కొరకు భోజనాల కొరకు బియ్యం కూడా లేవు ఈ సమస్య ఐదోవ వార్డు షేక్ జాకీర్ హుస్సేన్ నంద్యాల ఐయుఎంఎల్ ఉపాధ్యక్షులు ఈ మూడు బీద వాళ్ళ ఇంట్లో సమస్యను గమనించి జిల్లా నాయకుల సమక్షంలో పెట్టడం జరిగింది. ఈ సమస్యకు పరిష్కారం కొరకు జిల్లా ఉపాధ్యక్షులు హరుణ్ రషీద్ మరియు జాకీర్ తన వంతు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫునుంచి సాయం చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలానా అబ్దుల్ సలాం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కి మరియు వైఎస్ఆర్ సీపీ నాయకులను అడిగారు మీరు ఈ రోజు గడపగడపకు వైఎస్సార్ సీపీ  తిరగడం జరుగుతుంది మీరు ఏ హామీ పూర్తి చేశారని ప్రజలకు మీరు అడుగుతారా లేక మీరే చెబుతారా మేము మా పార్టీ వైఎస్సార్ సీపీ మైనార్టీలకు వైయస్సార్ దుల్హన్ పథకం అని పెడతాము ప్రతి ఒక్క ఆడబిడ్డ పెళ్ళికి లక్ష రూపాయలు ఇస్తామని కానీ ఇవ్వలేకపోయాము. మరియు విదేశీ విద్య కానుక వక్ఫ్ బోర్డు స్థలాలు రీ సర్వే అలాగే సబ్ ప్లాన్. వడ్డీ లేని రుణాలు మైనార్టీలకు ఇలాంటివి ఎన్నో చెప్పాము కానీ చేయలేక పోయాము జిల్లా ఉపాధ్యక్షులు మౌలానా రఫీ ఉద్దీన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తన వార్డులో తన ఊరిలో ఇలాంటివి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని అన్నారు. మరియు జిల్లా ప్రెసిడెంట్ హాజీ మస్తాన్ అక్బర్ అబ్బాస్ జాకీర్ చేతుల మీదుగా ఈ పెళ్లి కానుక ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూర్ అహ్మద్ నూర్ సుల్తాన్ మహబూబ్ కార్యకర్తలు పాల్గొన్నారు

Back to top button