
ఎంఎల్ఏ ముస్లిం సమస్యల పట్ల చొరవ చూపాలి – నంద్యాల ముస్లిం జేఎసి
ఎంఎల్ఏ ముస్లిం సమస్యల పట్ల చొరవ చూపాలి – నంద్యాల ముస్లిం జేఎసి
నంద్యాల (పల్లెవెలుగు) 09 మే: ఎంఎల్ఏ రవిచంద్ర కిశోర్ రెడ్డి ముస్లిం సమస్యల పట్ల చొరవ చూపాలని నంద్యాల ముస్లిం జేఎసి డిమాండ్ చేసింది. స్థానిక పట్టణం లోని జెఎసి కార్యాలయం లో ఆదివారం అధ్యక్షులు అబులైస్ అధ్యక్షతన జరిగిన జేఎసి కార్యవర్గ సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ జేఎసి నాయకులు ఎంఎల్ఏ ని కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళినప్పుడు సానుకూలంగా స్పందిస్తున్నారని, అయితే సమస్యలు పరిష్కారం జరగడంలేదని జేఎసి నాయకులు అసహనం వ్యక్తంచేశారు. ఉర్దూ కళాశాల అధ్యాపకుల జీతభత్యాలు, ప్రధాన మంత్రి యోజన 6 బిల్డింగ్ ల స్ధలసేకరణ, వక్ఫ్ ఆస్తుల ఆక్రమణల నియంత్రణ, ఈద్గాకు 5 ఎకరాల వక్ఫ్ స్థలం కేటాయింపులో ఆయన అనుకూలంగా ఉన్న సమస్యలు కొలిక్కి రావడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు తీర్చటానికి చొరవ చూపాలని ముస్లిం నాయకులు విజ్ఞప్తి చేసారు. ఈ సమస్యలపై ప్రజలు అసహనం తో ఉండి జేఎసి పై వత్తిడి చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమద్, ముహమ్మద్ యూనూస్, మస్తాన్ ఖాన్, కరీముల్లా, అబ్దుల్ అలీం సయ్యద్ ఖాద్రీ, సద్దాం హుసేన్ తదితరులు పాల్గొన్నారు