Nandyal

దామోదర సంజీవయ్య 50 వ వర్ధంతి

దామోదర సంజీవయ్య 50 వ వర్ధంతి

నంద్యాల (పల్లెవెలుగు) 08 మే: నంద్యాల జిల్లా రాజీవ్ గాంధీ భవన్, కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు  దాసరి చింతలయ్య దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలవేసి  ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంజీవయ్య కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, పెద్ద పాడు గ్రామం లో సుంకులమ్మ మునయ్య కి జన్మించడం జరిగింది. ఆనాటి తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నియమించడం కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక అధికారులను పెద్ద పాడు గ్రామం పంపించి దామోదరం సంజీవయ్య  గుణగణాలను తెలుసుకోవడానికి పెద్ద పాడు గ్రామంకు పంపడం జరిగింది. ముఖ్యమంత్రి గా నియమించడం జరిగింది. సంజీవయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకుని వచ్చారు. ఆనాడు వితంతు పింఛన్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి సంజీవయ్య అన్నారు. ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ హాస్టల్ ను నెలకొల్పారు.  దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో  కిసాన్ సెల్ అధ్యక్షుడు శివారెడ్డి, జిల్లా సెక్రెటరీ రెహమాన్, నంద్యాల నియోజకవర్గ  కోఆర్డినేటర్ ఫరూక్, సీనియర్ నాయకులు అహ్మద్  హుస్సేన్,  జాకీర్, షడ్రక్  మొదలగు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks