NandyalAbdul Javid

దాతల సహకారంతో పెయింటర్ రాజేంద్రుడుకి నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ కు ఆర్థిక సాయం అందజేత

దాతల సహకారంతో పెయింటర్ రాజేంద్రుడుకి నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ కు ఆర్థిక సాయం అందజేత

నంద్యాల (పల్లెవెలుగు) 05 మే: పట్టణంలోని నూనెపల్లె ప్రాంతం హరిజన పేటలో నివాసం ఉన్న పెయింటర్ రాజేంద్రుడు నెల క్రితం ఇంటి నిర్మాణ గోడలకు పెయింటింగ్ వేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు క్రిందపడి తన పక్కటెముక విరిగినది. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు  ఆపరేషన్ చేయడం వలన పెయింటింగ్ పని చేయడం కష్టమని తెలియజేశారు. తన మేస్త్రి ఇద్రుస్ బాషా పెయింటర్ రాజేంద్రుడి పరిస్థితిని మదర్ యూత్ అసోసియేషన్ ద్వారా సిటీ కేబుల్, పేపర్ న్యూస్ లో  ప్రసారం చేయగా గమనించిన దాతలు తమ వంతు ఆర్థిక సాయం  చేశారు.  అలాగే తన మేస్త్రి ఇద్రుస్ బాషా తనకు తెలిసిన దాతలను సహకారం అడగగా వారు వెంటనే స్పందించి పెయింటర్ రాజేంద్రుడి కుటుంబ పోషణకు నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ కు ఆర్థికంగా సహకరించారు.  తన పరిస్థితి చూసి సహకరించిన దాతలకు పెయింటర్ రాజేంద్రుడు మరియు తన మేస్త్రి ఇద్రుస్ భాష కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన పెయింటర్ రాజేంద్రుడి కి నంద్యాలలోని పెయింటింగ్ షాప్స్ ఓనర్స్ , బిల్డర్స్ మీ వంతు సహాయ సహకారాలు అందించాలని  దాతలను మేస్త్రి ఇద్రుస్ బాషా, మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.మురళి, సభ్యుడు హుస్సేన్ వలి కోరడం జరిగినది.

Back to top button