NandyalAbdul Javid

టీడీపీ నాయకులను అనగదొక్కే ప్రయత్నాలు తగవు పట్టణ అధ్యక్షులు మనియర్ ఖలీల్

టీడీపీ నాయకులను అనగదొక్కే ప్రయత్నాలు తగవు పట్టణ అధ్యక్షులు మనియర్ ఖలీల్

నంద్యాల (పల్లెవెలుగు) 05 మే: పట్టణంలో గురువారం తెల్లవారుజాము నుండి తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసు అధికారులు అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వెంటనే అక్కడకు చేరుకున్న పట్టణ అధ్యక్షులు మనియర్ ఖలీల్ కౌన్సిలర్లు మాబు వలి నాగార్జున మాట్లాడుతూ జిల్లాలో మొన్న 10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయిన కారణంగా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా కు పిలుపునిచ్చిన నేపధ్యంలో టి.ఎన్.ఎస్.ఎఫ్ నాయకులతో పాటు పార్టీలో ఉన్న ఇతర నాయకులను పట్టణ కార్యదర్శి సుహైల్. పట్టణ తెలుగు యువత నంద్యాల పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా (గుల్లి) ని అర్ధరాత్రి ఇండ్ల వద్దకు వెళ్లి భయబ్రాంతులకు గురిచేసి అక్రమ అరెస్టులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టి.ఎన్. ఎస్.ఎఫ్ నాయకులు ఎవరోఇతర నాయకులు ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో పోలీసు అధికారులు ఉన్నారని పోలీసులు అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కోర్టు తలుపులు తట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులను అనగదొక్కే ప్రయత్నాలు మానుకోవాలని లేని పక్షంలో తగిన విధంగా బుద్ది చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని రాత్రి  అక్రమ అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని పెద్ద ఎత్తున కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకున్న తరువాత దాదాపు 10గంటలు స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించారని అనంతరం సీఆర్పీసి 151కింద ముందస్తు అరెస్టు చేసి సొంత పూచీకట్టుపై విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ విభాగం నంద్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి మస్తాన్ బాబా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks