NandyalAbdul Javid

ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి

ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి

  • ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను గడువులోగా పరిష్కరించండి
  • సచివాలయ సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్

నంద్యాల, మే 2:  ప్రభుత్వం పటిష్ఠంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం పాణ్యం మండల కేంద్రంలోని ఒకటవ సచివాలయము, 4వ సచివాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి ప్రజల మెప్పు పొందాలని ఆదేశించారు. సకాలంలో విధులకు హాజరై ప్రజలకు అందుబాటులో వుంటూ ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలన్నారు. సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక తదితర రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేసి అర్హులైన పేదలకు సంబంధిత పథకాల ప్రయోజనాలు అందించేలా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సచివాలయం ద్వారా రోజులో వీలైనన్ని ఎక్కువ సర్వీసులను సకాలంలో అందించాలన్నారు. సచివాలయ సిబ్బంది తాము సక్రమంగా పని చేయడంతో పాటు తమ పరిధిలో ఉన్న వాలంటరీ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేసేలా బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జగనన్న కాలనీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

పాణ్యం మండలంలోని మేకల బండ జగనన్న లేవుట్ కాలనీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ల పథకం కింద జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పనులు ముమ్మరం చేయాలని జిల్లా  కలెక్టర్ డా. మనజీర్ జిలానీ సామూన్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు డిఆర్డిఎ సంస్థ ద్వారా రుణాలు మంజూరు చేయించి గృహ నిర్మాణాల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకా ప్రారంభం కాని ఇళ్లను  వెంటనే మొదలు పెట్టించాలని డీఈ ని ఆదేశించారు.

Back to top button