NandyalAbdul Javid

ఈద్ ఇస్లాం సంస్కృతికి ప్రతిబింబంగా నిర్వహిద్దాం

ఈద్ ఇస్లాం సంస్కృతికి ప్రతిబింబంగా నిర్వహిద్దాం

  • నంద్యాల జమాఆతె ఇస్లామీ అధ్యక్షులు సమద్

 నంద్యాల (పల్లెవెలుగు) 05 మే: ఈద్ ఇస్లాం సంస్కృతికి ప్రతిబింబంగా నిర్వహిద్దాం అని జమాఆతె ఇస్లామి హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్ ముస్లిం సమాజానికి పిలుపు నిచ్చారు. రమజాన్ పండుగ సంధర్భంగా ఆయన ఈద్ సందేశం ఇస్తూ,దైవ కారుణ్యంతో పవిత్ర రమజాన్ మాసాంతంగా ఉపవాసాలు ఉండి నిర్వహించె పండుగె “ఈద్” అన్నారు. ఇస్లాం ఓ దేశానికో, ప్రదేశానికో పరిమితం కాలేదు. దాని సరిహద్దు విస్తారమైనది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ జీవన విధానంలో దైవ సమర్పణ కారుణ్యతలకు లోబడే ఏ వేడుకైనా నిర్వహించుకోవాలి, ఇస్లాం సృష్టికర్తకు పూర్తిగా దాసోహం అంటుంది కాబట్టి, దాని విశ్వాసులు అయిన మనం ఆరాధనలో అయినా వేడుకల్లో అయినా శోకాలలోనూ దైవ విధేయతతో మసులుకోవాలని సమద్ కోరారు. సృష్టికర్తను శ్లాఘిస్తూ సామూహికంగా మోకరిల్లిడమే ఈద్! ఇస్లాంలో పండుగలు రెండే, వాటిని ఈద్ గా పేర్కొంటారు. ఈద్ అంటే సాహిత్య పరంగా వ్యాకరణం పరంగా ఆనందంగా, మళ్ళీమళ్ళీ వచ్చే వేడుక. అందుకే ఈద్ ప్రేమ, సౌభ్రాతృత్యాల మేళవింపు. ఈద్ ఆనందంతో మనిషిలో సోదరభావం ఉప్పొంగాలి. ఈర్ష్యా ద్వేషాలను ఈ రోజు నుండి హృదయపుటల నుండి దూరం చేయాలి అని సమద్ కాంక్షించారు. ఈద్ తో ప్రతి హృదయం స్వచ్ఛమైన నిష్కళంకమైన దర్పణం కావాలి, ఈద్ వేడుక మనిషిలో భౌతిక, ఆధ్యాత్మిక ప్రకాశానికి నాంది పలుకాలి, ఈద్  అవసరపరుల, అగత్య పౌరులకు ఆదుకునే అవకాశంగా మలుచుకోవాలి మనకు తారసపడె పేదలకు ఆదుకొనె తత్వం అలువరచుకోవాలి అని జమాత్ అధ్యక్షులు హితవు పలికారు. ఉపవాసం వల్ల ఆత్మ ప్రక్షాళన చేసుకొని పరిపూర్ణులు అయిన వారికి ‘ఈదుల్ ఫితర్’ పండుగా ఓ బహుమానంగా పొందాలన్నారు. జమాఆతె ఇస్లామీ అధ్యక్షులు సమద్ అందరికి ఈద్ శుభాకాంక్షలు తెలుపుతు, పండుగ సంధర్భంగా యువతను అదుపు చేయాలని ద్విచక్రవాహనాలపై వేగంగా, శబ్దాలతో త్రిబుల్ రీడింగ్ వెళుతూ ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని, ఇతరులకు ఇబ్బంది కలిగించరాదని యువతను కోరారు.

Back to top button
Enable Notifications    OK No thanks