Nandyal

పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించిన  టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్.ఎమ్.డి ఫారూఖ్

పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించిన  టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్.ఎమ్.డి ఫారూఖ్

నంద్యాల (పల్లెవెలుగు) 30 ఏప్రిల్:  పట్టణంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలు సంతోషంగా పండుగకు జరుపుకోవడానికి తమ వంతు సహాయంగా రంజాన్ తోఫా అందించడం జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్.ఎమ్.డి ఫారూఖ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా ప్రభుత్వం తరపున అందించేవారని వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఇంతవరకు ముస్లింలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని మైనార్టీలకి నాడు చంద్రబాబు పెట్టిన కోట్ల విలువైన పధకాలు పథకాలన్నీ రద్దు చేసి ముస్లీం సోదరులని నిండా ముంచిన జగన్ కు ఇఫ్తార్ విందులు ఇచ్చే అర్హత లేదన్నారు అంకెల గారడీలతో మాయ మాటలలు చెప్పి ఇంకా ఎన్నాళ్ళు ముస్లిం సమాజాన్ని మోసం చేస్తారని ప్రశ్నించారు ఇప్పటికైనా జగన్ కళ్ళు తెరిచి ముస్లిం సమాజానికి ఇచ్చిన ప్రతి హామీని అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ విభాగం రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ముల్లా ఇలియాస్,  విశ్వనాధ్ రెడ్డి., చంద్ర రెడ్డి, మాజీ కౌన్సిలర్ మిద్దె హుస్సేని,  పిట్టల మాదర్సా సైలబ్. అక్బర్. నస్యం షబ్బీర్ మహబూబ్ బాషా సుహైల్ రానా పాల్గొన్నారు.

Back to top button