NandyalAbdul Javid

పెంచిన పెట్రోలు. డీజల్ గ్యాస్ ధరలు తగ్గించాలి – కాంగ్రెస్ పార్టీ

పెంచిన పెట్రోలు. డీజల్ గ్యాస్ ధరలు తగ్గించాలి – కాంగ్రెస్ పార్టీ

నంద్యాల (పల్లెవెలుగు) 29 ఏప్రిల్: ఇటీవల జరిగిన ఎన్నికలలో ఐదు రాష్టాల ఫలితాలు వచ్చినప్పుడు నుంచి కేంద్రం ప్రభుత్వం ప్రతి రోజు పెట్రోలు డీజల్. గ్యాస్ ధరలను పెంచుతూ పేద ప్రజల పై పెను భారాలను మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు తగ్గించాలని కోరుతూ నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూనేపల్లి లోని ఓవర్ బ్రిడ్జి దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఊ కొట్టు వాసు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య మాట్లాడుతు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ డీజల్ పెట్రోలు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వలు కారణం అని చెప్పడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం టాక్స్ తగ్గిస్తే ధరలు తగ్గుతాయి అని దేశ ప్రధాని అనడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వలు ఒకరు మీద ఒకరు చెప్పడం మానుకొని ధరలు తగ్గించాలి అని పెట్రోలు డీజిల్ పెరిగినందువల్ల నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి అని సామాన్య ప్రజలు బ్రతకాలంటే భయపడుతున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధిక ధరలను నిత్యవసర రేట్లను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని పెట్రోలు డీజిల్ పై ఉన్న వాట్ ను ఎత్తివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంటనే చర్యలు చేపట్టాలని. కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమం లో  ట్రెజరర్ ప్రసాద్, ఫరూక్, మాసూమ్, రత్నా మయ్య, జాకిర్, శివ రెడ్డి, కృష్ణ, లక్షమయ్య మొదలగు కాంగ్రెస్ నాయకులు పాలుగోన్నారు

Back to top button