NandyalAbdul Javid

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రార్థన చేసే ఈద్గా ప్రాంతాల పరిసరాలను శుభ్రం చేయాలి

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రార్థన చేసే ఈద్గా ప్రాంతాల పరిసరాలను శుభ్రం చేయాలి

నంద్యాల (పల్లెవెలుగు) 29 ఏప్రిల్: స్థానిక నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్యాలయ మేనేజర్ శ్రీనివాసులుకు నంద్యాల ముస్లిం, స్టూడెంట్, యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు షేక్.రియాజ్, దాదా భాయ్, సద్దాం, సిద్దిక్, మస్తాన్ వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా షేక్.రియాజ్ మాట్లాడుతూ ముస్లిం ప్రజలకు అతి పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రార్థన చేసే ఈద్గా ప్రాంతాల పరిసరాలను శుభ్రం చేయాలని, ఈద్గాల పక్కన ఉన్న కాలువల్లో చెత్త చెదరాలు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని, వారు కోరారు. స్పందించిన నంద్యాల మున్సిపల్ మేనేజర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈద్గాల ప్రాంతాల వద్ద పారిశుద్ధ్య పనులు చేపించి శుభ్రంగా ఉంచుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వలి, రియాజ్ ఖాన్, కైఫ్, ఇమ్రాన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Back to top button