NandyalAbdul Javid

ఆల్ మేవా రంజాన్ తోఫా

ఆల్ మేవా రంజాన్ తోఫా

నంద్యాల (పల్లెవెలుగు) 28 ఏప్రిల్: స్థానిక నంద్యాల జిల్లా లోని కార్యాలయం లో కలెక్టర్ మనాజిర్ జీలాని సమూన్,IAS  చేతుల మీదుగా కలెక్టరేట్ ఛాంబర్ నందు కొంతమంది బీదవారికి ఆల్ మేవా రంజాన్ తోఫా కిట్ల పంపిణీకి చేసారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆల్ మేవా సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు బీదవారికి మేలు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమానికి ఆల్ మేవా నంద్యాల జిల్లా అధ్యక్షులు ఇంజనీర్ సయ్యద్ ఇమ్రాన్ పాషా, రాష్ట్ర గౌరవ సలహాదారు S.Md.అబులైస్ మరియు జిల్లా గౌరవ అధ్యక్షులు S.అబ్దుల్ సమద్,  వైస్ ప్రెసిడెంట్ జాకీర్ హుస్సేన్ ఫారెస్టర్, అమీరుద్దీన్ టీచర్, మహమ్మద్ లతీఫ్ టిజిపి, ముహమ్మద్ గౌస్ వెల్ఫేర్ అసిస్టెంట్, S.Md. అసద్, మునీర్ ఫార్మసిస్ట్ మొదలగు వారు హాజరయ్యారు.  వారు మాట్లాడుతూ ఆల్ మేవా గత కొన్ని సంవత్సరాలుగా రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న దని, ఈ సంవత్సరం వివిధ ప్రభుత్వ సంస్థలలో పనిచేయుచున్న మైనార్టీ ఎంప్లాయీస్ వారి జకాత్ డబ్బుల నుండి 1,58,000 విరాళాలు పంపారని, వాటితో 322 రంజాన్ తోఫా కిట్లు తయారు చేసి నంద్యాల టౌన్ లోని వివిధ ప్రాంతాలలో 322 మంది బీదవారికి తమ కార్యవర్గ సభ్యులు వారి ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వారికి సహకరించిన జిల్లా కలెక్టర్ కి మరియు మైనారిటీ ఎంప్లాయీస్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Back to top button