NandyalAbdul Javid

35వ వార్డు ప్రజలకు రంజాన్ తోఫా

35వ వార్డు ప్రజలకు రంజాన్ తోఫా

నంద్యాల (పల్లెవెలుగు) 27 ఏప్రిల్: గత తెలుగు దేశం పార్టీ హయాంలో అధినాయకుడు మైనారిటీ సోదర సోదరిమణుల పక్షపాతి ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్ర మైనారిటీ ప్రజాలందరికి పండగను సంతోషంగా జరుపుకునేందుకు రంజాన్ తోఫా అందించిన విషయం విదితమే. ప్రస్తుతం సాగుతున్న ప్రభుత్వ  నియంత పాలన  కారణంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా రంజాన్ తోఫా అందించక పోవడంతో పేద ప్రజలు పండగను సంతోషంగా జరుపుకునేందుకు సాధ్యం కావడం లేదని ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ని ఆదర్శంగా తీసుకొని తీసుకుని గత మూడేళ్ళ నుంచి 35 వ వార్డులో సొంత నిధులతో రంజాన్ తోఫాను నంద్యాల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి Nmd ఫిరోజ్, మరియు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మ నంద రెడ్డి చేతుల మీదుగా రంజాన్ తోఫా వార్డు ప్రజలకు అందించడం జరిగిందని 35 వ వార్డ్ ఇంచార్జ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మనియర్ ఖలీల్ అహ్మద్ గారు,11వ టీడీపీ ఇంచార్జ్ కట్టెల అఫ్జల్ బాషా, టీడీపీ ముల్లాన్ పేట ఇంచార్జ్ గోవింద నాయుడు, టీడీపీ కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks