NandyalAbdul Javid

సోదర భావాన్ని పెంపొందించేందుకే ఇఫ్తార్ విందులు

సోదర భావాన్ని పెంపొందించేందుకే ఇఫ్తార్ విందులు

  • తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎమ్.డి ఫిరోజ్

నంద్యాల (పల్లెవెలుగు) 25 ఏప్రిల్: ఇఫ్తార్ విందులు సోదరభావాన్ని, సఖ్యతను పెంపొందిస్తాయని ప్రతిరోజు పలు మసీదులలో తమ కుటుంబం తరపున ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరుగుతోందని ఇప్పటికే దాదాపు 50 మసీదులలో తమ సొంత నిధులతో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశామని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎమ్.డి ఫిరోజ్ పేర్కొన్నారు.  ఈ సందర్భంగా  ఫిరోజ్ మాట్లాడుతూ ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం, సఖ్యత వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ మాసం ముఖ్య ఉద్దేశ్యమని అందువల్ల ముస్లిం సోదరులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారన్నారు. అలాగే ముస్లిం సోదరులందరూ ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ అల్లా మన్ననలు పొందాలన్నారు. ప్రతి ఒక్కరూ పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పవిత్రతను గుర్తించి అల్లా అనుసరించిన మార్గంలో నడవాలన్నారు. మా కుటుంబాన్ని ఇంతలా ఆదరిస్తున్నా సోదరులందరికి కృతఙ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అక్బర్, సైలబ్. నస్యం షాకిర్. నస్యం షబ్బీర్. అప్జల్, సర్దార్. బీరువా ఖాదర్ బాషా, సుహైల్ రానా తదితరులు పాల్గొన్నారు

Back to top button