NandyalAbdul Javid

స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తాం…ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి ఐ. పి.ఎస్

స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తాం…ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి ఐ. పి.ఎస్

నంద్యాల (పల్లెవెలుగు) 25 ఏప్రిల్:  నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో  స్పందన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ కె. రఘువీర్ రెడ్డి ఐ. పి.ఎస్ ఫిర్యాదిదారుల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ స్పందన కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 63 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదిదారుల బాధలను, సమస్యలను జిల్లా ఎస్పీ సమగ్రంగా అడిగి తెలుసుకొని సంబంధిత పోలీస్ అధికారులతో వెంటనే ఫోన్ లో మాట్లాడి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం చెయ్యాలని ఆదేశించారు. ఆలాగే తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Back to top button