అర్జీదారుల మన్ననలు పొందేలా సమస్యలను పరిష్కరించండి

అర్జీదారుల మన్ననలు పొందేలా సమస్యలను పరిష్కరించండి

అర్జీదారుల మన్ననలు పొందేలా సమస్యలను పరిష్కరించండి

  • భూ తగాదా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి* *జవాబుదారీతనంతో పనిచేయాలి
  • స్పందన అర్జీలు రీ ఓపెన్ కాకూడదు
  • జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

నంద్యాల,(పల్లెవెలుగు) న్యూస్ఏప్రిల్ 25:  ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి అర్జీదారుల మన్ననలు పొందేలా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని (RARS) వైఎస్సార్ సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. డిఆర్ఓ పుల్లయ్య, మునిసిపల్ సహాయ కమీషనర్ వెంకటదాసు జిల్లాధికారులు, నంద్యాల, డోన్, ఆత్మకూరు డివిజన్ల నుండి ఆర్డిఓలు, మండల కార్యాలయాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, తహసీల్దార్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత కాలపరిమితిలోగా  పరిష్కరించి అర్జీదారుల మన్ననలను పొందాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమానికి భూ తగాదాల సమస్యలు అధికంగా వస్తున్నాయని వీటిపై ప్రత్యేక దృష్టి సారించి జవాబుదారీతనంతో పనిచేసి నిజమైన లబ్దిదారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. రీఓపెన్ అయిన కేసులు 23 శాతం వున్నాయని… ఇందులో రెవిన్యూ 54, గ్రామ సచివాలయాలకు చెందినవి17,  పంచాయతీ రాజ్ 15,  ఏపీఎస్పీడీసీఎల్ 10, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ 5,  తదితర శాఖలలో ఒక్కొక్కటి ఉన్న సమస్యలను మంగళవారం సాయంత్రంలోగా పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. లాగిన్ లో ఏవైనా సమస్యలు వుంటే టెక్నిషియన్ తో మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే సంతప్తి చెందేలా సరైన కారణాలు పేర్కొంటూ తిరస్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

వార్తా పత్రికలలో ప్రచురితమయ్యే ప్రతికూల వార్తలపై తక్షణమే స్పందించి సంబంధిత ప్రతికూల వార్తలపై స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ విషయాలను రీజాయిన్డెర్ రూపంలో ఇవ్వాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇరిగేషన్ తదితర శాఖలకు సంబంధించి అధికంగా ప్రతికూల వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిశీలించుకుని తగు చర్యలు గైకొనాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్తగా జిల్లా ఏర్పాటై దాదాపు 25 రోజులు గడుస్తోందని ఇంకా కొంత మంది జిల్లా స్థాయి అధికారులు కర్నూలు నుండి ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తూ విధులపై పూర్తిస్థాయి దృష్టి సారించడం లేదని వారం రోజుల్లో జిల్లా అధికారులు అందరూ నంద్యాలకు షిఫ్ట్ అయి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. లేనిపక్షంలో కొత్త జిల్లాలో అధికారులు అందుబాటులో లేరనే ప్రతికూల ప్రచారం ప్రసారమయ్యే ప్రమాదం ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లా కార్యాలయాలకు అవసరమయ్యే భవనాలు బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ లో మరమ్మతులు పూర్తయి సిద్ధంగా ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకుని స్థిరపడి విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.