
NandyalAbdul Javid
ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన న్యాయవాది
ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన న్యాయవాది
నంద్యాల (పల్లెవెలుగు) 23 ఏప్రిల్: వెల్లివిరిసిన మతసామరస్యం దేశంలో ఎటుచూసినా విద్వేష పూరితమైన వాతావరణం ప్రబలుతున్న నేటి తరుణంలో ఇటువంటి కార్యక్రమాలు మతసామరస్య పువ్వులను పూఇస్తున్నాయి. గత 12 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా న్యాయవాది వి. రామచంద్ర రావు ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో పోలీస్ లైన్ మస్జీద్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తూ మతసామరస్యాన్ని చాటిచెబుతున్నారు, శుక్రవారం నాడు ఆయన సుమారు 250 మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాట్లు చేయించారు, మస్జీద్ కమిటీ వారు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రామచంద్రరావు గారి కుమారుడు సుజీత్ ను మస్జీద్ కమిటీ మెంబర్లు మాలిక్ భాయ్, ఫయాజ్, NMJAC అధ్యక్షులు అబులైస్ శాలువతో సత్కరించారు.